News April 15, 2025
సామర్లకోట: తల్లి ప్రేమకు దూరమైన చిన్నారి ప్రవల్లిక

తల్లి ప్రేమకు చిన్నారి ప్రవల్లిక దూరమైంది. ఇటీవలి అనకాపల్లి జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో సామర్లకోట మండలం గూడపర్తికి చెందిన దేవర నిర్మల మృతి చెందారు. ఆమె కుమార్తె చిన్నారి ప్రవల్లికను ఒక మహిళ మృత్యువు నుంచి కాపాడింది. అయితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి తల్లి ప్రేమను కోల్పోయింది. తల్లి మృతి చెందిన విషయం ఆ చిన్నారికి తెలియదు. అభంశుభం తెలియని ఆ చిన్నారి తల్లి కోసం వెతుకుతోంది.
Similar News
News September 14, 2025
విజయవాడలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

విజయవాడ నగర వ్యాప్తంగా, రూరల్ ప్రాంతాల్లో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ.190గా ఉంది. స్కిన్ లెస్ కేజీ రూ. 250, స్కిన్ కేజీ రూ.250 విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. గత వారంతో పోలిస్తే కేజీకి 10 రూపాయలు ఎక్కువగా ఉంది. మటన్ కేజీ రూ. 980గా ఉంది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News September 14, 2025
అనకాపల్లి: ఢిల్లీ సదస్సుకు కొత్తూరు సర్పంచ్

నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈనెల 15 న జరిగే సదస్సుకు అనకాపల్లి మండలం కొత్తూరు సర్పంచ్ ఎస్ లక్ష్మీప్రసన్నకు ఆహ్వానం అందింది. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి 75 మంది సర్పంచులను సదస్సులకు ఆహ్వానించగా ఏపీ నుంచి ఆరుగురు ఉన్నారు. వారిలో కొత్తూరు సర్పంచ్ ఒకరు కావడం విశేషం. ఈ మేరకు ఆమె ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.
News September 14, 2025
HYD: నేడు గాంధీ మెడికల్ కాలేజీ వ్యవస్థాపక దినోత్సవం

సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాల నేటికి 71 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గాంధీ కళాశాల ప్రాంగణంలోని అలుమ్ని భవనంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు డా.జీఆర్ లింగమూర్తి, వెంకటరత్నంలు తెలిపారు. కాగా.. గాంధీ మెడికల్ కళాశాల దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్పత్రిగా నిలిచింది.