News March 10, 2025
సామర్లకోట: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

సామర్లకోట మండలం గొంచాల గ్రామం వద్ద బైకు అదుపు తప్పడంతో యువకుడు మృతి చెందాడు. సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు చంద్రంపాలెం గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు స్థానికులు వివరించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 10, 2025
HYD: సీఎంని కలిసిన అద్దంకి దంపతులు

సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని కలిసి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను కాంగ్రెస్ ప్రకటించడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు.
News March 10, 2025
నల్గొండ: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు

ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సోమవారం అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
News March 10, 2025
పంత్‌ను కాదని KL వైపు గౌతీ మొగ్గు.. ఎందుకంటే!

CT 2025లో రిషభ్ పంత్‌ను కాదని KL రాహుల్‌ను కోచ్ గౌతమ్ గంభీర్ ఎంచుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వన్డేల్లో పంత్ తన X ఫ్యాక్టర్ నిరూపించుకోలేదు. స్పిన్ పిచ్‌లపై అంతగా ప్రభావం చూపలేదు. పైగా దుబాయ్ వంటి పిచ్‌లపై బౌలర్లు పెట్టే పరీక్ష ఎదుర్కోవాలంటే ఓపిక, మెరుగైన షాట్ సెలక్షన్, పరిణతి అవసరం. అతడిది ఇంపల్సివ్ నేచర్. తన వికెట్ విలువ తెలుసుకోకుండా ఔటైపోతారు. అందుకే KLవైపు గౌతీ మొగ్గారు.