News April 4, 2025

సామర్లకోట: మున్సిపల్ ఛైర్ పర్సన్‌తో సహా మరో నేతపై వైసీపీ సస్పెన్షన్ వేటు

image

సామర్లకోట మున్సిపల్ ఛైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తితో సహా జడ్పీటీసీ భర్త సూర్యనారాయణ మూర్తి (నరేశ్)పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసినట్లు పార్టీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్‌ఛార్జ్ దొరబాబు ఆధ్వర్యంలో ఆ ఇద్దరు నేతలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించారు.

Similar News

News July 5, 2025

VKB: ‘PHCలో మెరుగైన వైద్య సేవలు అందించాలి’

image

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా అప్రమత్తంగా ఉంటూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి లలితా దేవి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా వైద్యాధికారి సబ్ యూనిట్ అధికారులు ల్యాబ్ టెక్నీషియన్లు, పురుష ఆరోగ్య కార్యకర్తలతో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు ప్రబలే అవకాశం ఉందని మెరుగైన సేవలు అందించాలన్నారు.

News July 5, 2025

MBNR: కేసీఆర్ నివాసంలో నాయకుల సమావేశం

image

మాజీ సీఎం కేసీఆర్‌ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. కలిసిన వారిలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నారు.

News July 5, 2025

టెట్ ప్రిలిమినరీ కీ విడుదల

image

తెలంగాణ టెట్ ప్రాథమిక కీ విడుదలైంది. ఈ నెల 8 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని అధికారులు పేర్కొన్నారు. గత నెల 18 నుంచి 30 వరకు 9 రోజుల పాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్-1కు 74.65శాతం, పేపర్-2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 73.48, పేపర్-2(సోషల్ స్టడీస్)కు 76.23శాతం అభ్యర్థులు హాజరయ్యారు. కీ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.