News July 6, 2025
సామర్లకోట: యువకుడి హత్య.. నిందితుల అరెస్ట్

సామర్లకోట మండలంలో ఇటీవల చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పగించినట్లు సీఐ కృష్ణ భగవాన్ శనివారం తెలిపారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేశామని, దర్యాప్తులో హత్యగా తేలిందని ఆయన వెల్లడించారు. నిందితులపై సెక్షన్ 103(1), 238(a) r/w 3(5) బీఎంఎస్ కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని సీఐ పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
రైతులకు అవగాహన కల్పించండి: కడప కలెక్టర్

కడప జిల్లాలో ఈనెల 14వ తేదీ వరకు జరిగే పశుగ్రాస వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. పశుగ్రాస వారోత్సవాల గోడపత్రికలను ఆయన కడపలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసాలను సాగు చేసి రైతుల ఇంట సిరుల పండించేలా చూడాలన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పశుగ్రాసాల సాగు ఎంతో ఉపయోగకరమని ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
News July 6, 2025
ఆ హక్కు దలైలామాకు లేదు: చైనా రాయబారి

తన వారసుడిని ఎంపిక చేసే హక్కు బౌద్ధ మత గురువు దలైలామాకు లేదని భారత్‌లోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ స్పష్టం చేశారు. పునర్జన్మ విధానంలో దలైలామా ఓ భాగం మాత్రమేనని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ప్రస్తుతం చైనా టిబెట్, సిచువాన్, యునాన్, గన్సు, క్విగ్ హాయ్ ప్రావిన్సుల్లో 1,000 రకాల పునర్జన్మ విధానాలు అనుసరిస్తున్నారు. ఈ సంప్రదాయాలు దలైలామాతో ప్రారంభం కాలేదు. అలాగే అంతం కూడా కాలేదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
News July 6, 2025
GHMC ఆస్తులపై DGPS సర్వే

గ్రేటర్ HYDలో GHMC ఆస్తుల డీజీపీఎస్ సర్వేకు రంగం సిద్ధమైంది. చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో స్థిరాస్తులు, ఓపెన్ లేఅవుట్లు, పార్కులు, స్థలాలు కమ్యూనిటీ హాల్స్ సహా అన్ని వివరాలను సర్వే చేయించనున్నారు. సర్వే డిజిటలైజేషన్ కోసం కన్సల్టెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించింది. కార్యాలయ భవనాల నుంచి మున్సిపల్ షాపుల దాకా అన్ని వివరాలు పొందుపరచునున్నారు.