News March 20, 2025
సామర్లకోట : రైలు దిగుతూ జారి పడి వ్యక్తి మృతి

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో రైలు నుంచి దిగుతూ ఒక యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పెద్దాపురానికి చెందిన సిమ్ము సిరి త్రినాథ్ తల్లి విజయలక్ష్మి విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో ఉన్న త్రినాథ్ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి, ప్రమాదానికి గురయ్యాడు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 22, 2026
VZM: ఘనంగా పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు

రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ మాట్లాడుతూ.. వీల్ ఛైర్, ఆర్థో కేటగిరిలకు సంబందించి మెన్, ఉమెన్ విభాగాలకు పోటీలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరు కాగా 20 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన వారు ఈనెల 25, 26 తేదీల్లో జిల్లాలో జరుగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు.
News February 22, 2026
కల్కి-2 షూటింగ్ షురూ?

సూపర్ హిట్ మూవీ ‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్ మొదలైనట్లు సమాచారం. HYD శివార్లలో నిర్మించిన సెట్‌లో అమితాబ్, కమల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభాస్ కూడా పాల్గొంటారని టాలీవుడ్ టాక్. పార్ట్-2కు ‘కర్ణ: 3102 BC’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో యుద్ధ సన్నివేశాలను గ్రాండియర్‌గా తెరకెక్కించేందుకు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారట.
News February 22, 2026
వనపర్తి: శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు.. అద్దెకు తీసుకోవాలని డీఎం పిలుపు

వివాహాలు, విహారయాత్రల కోసం తక్కువ ధరకు ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వనున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రైవేటు వాహనాల కంటే తక్కువ ఖర్చుతో పాటు, డ్రైవర్ బత్తా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
79957 01851, 96765 63377, 73828 29313


