News March 21, 2025
సామర్లకోట: రైలు నుంచి జారిపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తూ కిందికి జారిపడడంతో తలకు బలమైన గాయమై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగి మృతి చెందింది. ఈ ఘటన సామర్లకోట రైల్వే పోలీస్టేషన్ పరిధిలో జి.మేడపాడు స్టేషన్ వద్ద గురువారం జరిగింది. ప్రమాద సమయంలో కొన ఊపిరితో ఉన్న యువతిని రైల్వే ఉద్యోగులు గుర్తించి చికిత్స నిమిత్తం సామర్లకోట తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు.
Similar News
News January 3, 2026
నంద్యాల జిల్లాలో 62 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నంద్యాల జిల్లాలోని KGBVల్లో 62 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 41, టైప్-4 కేజీబీవీల్లో 21 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: నేటి నుంచి జనవరి 11 వరకు
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.
News January 3, 2026
శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు నోటిఫికేషన్

శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
News January 3, 2026
కర్నూలు జిల్లాలో 78 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కర్నూలు జిల్లాలోని KGBVల్లో 78 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 56, టైప్-4 కేజీబీవీల్లో 22 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: నేటి నుంచి జనవరి 11 వరకు
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.


