News February 10, 2025
సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ మృతి

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు. హైదరాబాదులో స్థిరపడ్డ ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కూటమి నాయకులు హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో చికిత్సకు దోహదపడ్డారు. ఆయన మరణ వార్త విని ధర్మవరం నియోజకవర్గ ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
Similar News
News November 4, 2025
వేములవాడ రాజన్న ఆలయ ఇన్చార్జి ఈవోగా రాజేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం తాత్కాలిక కార్యనిర్వహణాధికారిగా రాజేష్ నియమితులయ్యారు. ఆలయ ఈవో ఎల్ రమాదేవి వ్యక్తిగత పనులపై సెలవు మీద వెళ్లడంతో సీనియర్ అధికారి అయిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేష్‌కు తాత్కాలికంగా ఇన్చార్జి ఈవో బాధ్యతలు అప్పగించారు. ఈవో రమాదేవి విధుల్లో చేరే వరకు రాజేష్ ఇన్చార్జి ఈవోగా కొనసాగుతారు.
News November 4, 2025
వేములవాడ రాజన్నకు రికార్డు స్థాయిలో కోడె మొక్కులు

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా రికార్డ్ స్థాయిలో భక్తులు కోడె మొక్కులు సమర్పించారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో స్వామివారి అన్ని రకాల ఆర్జిత సేవలను రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం నుంచి భీమేశ్వర స్వామి వారి ఆలయానికి మార్చిన కారణంగా భక్తుల రద్దీ తగ్గుతుందనే అంచనాలకు భిన్నంగా సోమవారం సుమారు 5000 మంది భక్తులు కోడె మొక్కుబడి చెల్లించుకున్నారు.
News November 4, 2025
విజయనగరంలోనూ భూప్రకంపనలు?

విశాఖ, అల్లూరి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున పలు చోట్ల భూమి కంపించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో <<18192060>>భూకంపం<<>> నమోదైనట్ల మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తన వెబ్‌సైట్‌లో మంగళవారం పొందుపరిచింది. మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటలకు 3.7 పాయింట్ల తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. విజయనగరంలోనూ పలుచోట్ల భూమి కంపించినట్లు పలువురు కామెంట్లు చేస్తున్నారు.


