News October 18, 2024

సారంగాపూర్: నీటిలో గుర్తు తెలియని శిశువు మృతదేహం

image

కల్వర్టు నీటిలో శిశువు మృతదేహం లభ్యమైన ఘటన సారంగాపూర్ మండలం బోరేగాం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై శ్రీకాంత్ వివరాల మేరకు… గ్రామ శివారులోని చిన్న కల్వర్టు దగ్గర నీటిలో ఒక మగ శిశువు స్థానికులకు కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Similar News

News October 18, 2024

మంచిర్యాల అభివృద్ధికి అందరు సహకరించాలి: ఎమ్మెల్యే పీఎస్ఆర్

image

మంచిర్యాల పట్టణ అభివృద్ధికి వ్యాపారస్తులతో పాటు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలో జరుగుతున్న రోడ్ల వెడల్పు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. వ్యాపార దుకాణాల సముదాయాలు నిబంధనల ప్రకారం ఉండాలని పేర్కొంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. పట్టణ సుందరీకరణ పనులు అభివృద్ధిలో భాగమని ఎమ్మెల్యే అన్నారు.

News October 17, 2024

వాంకిడి: బకెట్‌లో పడి 10 నెలల బాలుడు మృతి

image

 ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వాంకిడి మండలంలో ప్రమాదవశాత్తు పది నెలల బాలుడు బకెట్‌లో పడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తేజాపూర్ గ్రామానికి చెందిన గిర్మాజీ- సునీత దంపతుల కుమారుడు తన్వీజ్ ఆడుకుంటూ వెళ్లి బాత్ రూమ్‌లో ఉన్న బకెట్‌లో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి బాలుడు మృతి చెంది కనిపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై పోశెట్టి తెలిపారు.

News October 17, 2024

కొమరం భీం ఆశయ సాధన కోసం కృషి చేయాలి: సీతక్క

image

కొమరం భీమ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కొమరం భీం 84వ వర్ధంతి సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్లో భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కొమరం భీం చేసిన పోరాటం త్యాగం మరువలేనిది అన్నారు. అతని అడుగుజాడల్లో నడవాలి అన్నారు.