News April 6, 2025
సారపాక గెస్ట్ హౌస్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు

భద్రాద్రి రామయ్య కళ్యాణానికి విచ్చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారపాకలోని గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, మాలోత్ రాందాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్, అటవీ శాఖ రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఉన్నారు.
Similar News
News November 9, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 102 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 102 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 64, సెంట్రల్ జోన్ పరిధిలో 16, వెస్ట్ జోన్ పరిధిలో 9, ఈస్ట్ జోన్ పరిధిలో 13 కేసులు నమోదయ్యాయి.
News November 9, 2025
HYD: తండ్రి మరణం తట్టుకోలేక యువతి సూసైడ్

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక సౌమ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.బ్లాక్ నంబర్–4 అపార్ట్‌మెంట్స్‌లోని మూడో అంతస్తు నుంచి దూకిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు నిలువలేదు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.