News April 8, 2024

సార్వత్రిక ఎన్నికలకు సర్వం సన్నద్ధం కావాలి: కలెక్టర్

image

అన్నమయ్య జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా మండల స్థాయి నోడల్ అధికారులను ఆదేశించారు. అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ అంశంలో తీసుకున్న చర్యలపై నియోజకవర్గం వారీగా కూలంకషంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షించారు.

Similar News

News February 21, 2026

పుష్పగిరి ఆలయంలో అద్భుత శిల్పాలు

image

వల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ, శ్రీవైద్యనాథ ఆలయాల్లోని కుడ్యశిల్పాలు విశేషంగా ఉన్నాయని చరిత్రకారుడు రమేష్ తెలిపారు. ఒకే ఇతివృత్తంతో, భిన్న భంగిమల్లో శివుని ఊర్ధ్వ, చతుర తాండవాలు, పార్వతీదేవి కూర్చున్న, నిలుచున్న రూపాలు చెక్కారు. ఒకే శిల్పంలో వృషభం, నందికేశ్వరుడు వేర్వేరుగా ఉండటం ఆనాటి శిల్పుల అద్భుత నైపుణ్యానికి సజీవ సాక్ష్యం.

News February 21, 2026

మదనపల్లె: కులవర్ధన్ తల్లి కోసం వెతుకులాట

image

మదనపల్లెలో బాలిక హత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. A1 కులవర్ధన్ చనిపోయిన విషయం తెలిసిందే. A2గా అతని తల్లి అంజలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. ఆమెను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందన్నారు.

News February 21, 2026

రౌడీ షీటర్లపై అప్రమత్తంగా ఉండండి: కడప SP

image

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని SP నచికేత్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న రౌడీ షీటర్లు, ట్రబుల్ మేకర్స్‌పై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు.