News June 14, 2024
సార్వత్రిక ఫలితాల్లో సంగారెడ్డి ఫస్ట్.. సిద్దిపేట లాస్ట్
ఓపెన్(సార్వత్రిక) పది, ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోనే సంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. పదో తరగతితో 79.6% ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా ఫస్ట్ స్థానంలో నిల్వగా.. 77.95 %తో మెదక్ ద్వితీయ, 42.65% సిద్దిపేట జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇంటర్‌లో సంగారెడ్డిలో 67.03 %, మెదక్ 60.16%, సిద్దిపేటలో 37.18% ఉత్తీర్ణత నమోదైనట్లు సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Similar News
News January 15, 2025
మెదక్: పోరాట యోధుడి జయంతి నేడు
1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.
News January 15, 2025
GET READY.. 18న నవోదయ ప్రవేశ పరీక్ష
నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు NVS ఈనెల 18న ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని వర్గల్ నవోదయ ప్రిన్సిపల్ తెలిపారు. వెబ్‌సైట్ www.Navodaya.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థి పుట్టిన తేదీ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
News January 15, 2025
మెదక్: చాముండేశ్వరి దేవిని దర్శించుకున్న ఎస్పీ
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ మంజీరా నది తీరాన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం సతీసమేతంగా సందర్శించారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఎస్పీ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీరితోపాటు చిలిపిచేడ్ మండల ఎస్ఐ నర్సింలు, సిబ్బంది పాల్గొన్నారు.