News April 9, 2025

సాలార్జంగ్ మ్యూజియంలో అంబేడ్కర్ ఫొటో ఎగ్జిబిషన్

image

సాలార్జంగ్ మ్యూజియంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించినట్లుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఘంటా చక్రపాణి, IIS డైరెక్టర్ ఆశిష్ గోయల్ తెలిపారు. అంబేడ్కర్ జీవితం మొత్తం కనులకు కట్టినట్లు ఎగ్జిబిషన్‌లో అద్భుతంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 13, 2026

BREAKING: జనగామలో హంగ్.. BRS 13, CONGRESS 12

image

జనగామ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 30 వార్డులు ఉండగా BRS 13, కాంగ్రెస్ 12, సీపీఎం 1, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలిచారు. కాగా అధికార, ప్రతిపక్ష పార్టీలు మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో జనగామలో ఏం జరుగుతుందోనని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

News February 13, 2026

నేరేడుచర్ల: కౌన్సిలర్లుగా గెలిచిన భార్యాభర్తలు

image

నేరేడుచర్ల మున్సిపాలిటీ ఫలితాలలో భార్య భర్తలు ఇద్దరు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి 4వ వార్డు అభ్యర్థిగా కొణతం మంజుల, 15వ వార్డు అభ్యర్థిగా కొణతం చిన్న వెంకట్ రెడ్డి ఇద్దరూ పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. గెలుపునకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. వారికి పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

News February 13, 2026

నీట్ ర్యాంకులతో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు

image

AP: నాలుగేళ్ల B.Sc (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలను నీట్-UG పరీక్ష ర్యాంకుల ఆధారంగా కల్పించాలని GOVT నిర్ణయించింది. గతంలో ఇంటర్, ఈఏపీసెట్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు జరగ్గా గత ఏడాది APNCET పెట్టారు. అయితే 16000 సీట్లకు గాను 4000 మిగిలిపోయాయి. దీంతో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తాజా ప్రతిపాదనలు సమర్పించగా CM ఆమోదించారు. ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకొనే వారు 2026-27 నుంచి నీట్-UG పరీక్ష రాయాల్సి ఉంటుంది.