News August 14, 2024
సాలూరు: అన్న క్యాంటీన్‌కు మంత్రి విరాళం

సాలూరులోని అన్న క్యాంటీన్‌లో భోజనం అందించేందుకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. బుధవారం సాలూరు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో అన్న క్యాంటీన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. పేదలు ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 24, 2025
జాతీయ సైన్స్ ఫెయిర్‌కు విజయనగరం విద్యార్థుల ఎంపిక

చీపురుపల్లి బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు జాతీయ స్థాయితో పాటు దక్షిణ భారత స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికయ్యాయి. విద్యార్థుల విభాగంలో “క్రాప్ డాక్టర్” ప్రాజెక్ట్ ఎంపికైంది. సుస్థిర వ్యవసాయ లక్ష్యంతో ఏఐ ఆధారిత మొబైల్ యాప్ ద్వారా రైతులకు పంట సమస్యలపై మార్గదర్శకత్వం అందించనున్నారు. పొట్టా స్వప్న రూపొందించిన “గ్రీన్ ల్యాబ్” ప్రాజెక్ట్ జాతీయ స్థాయికి చేరింది.
News December 24, 2025
ఎం-కేడ్ పథకంతో పెద్దగెడ్డ ప్రాజెక్టు అభివృద్ధి: VZM కలెక్టర్

ఎం-కేడ్ పథకం ద్వారా పెద్దగెడ్డ ప్రాజెక్టును ఆధునీకరించేందుకు రూ.78.2 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర నిధుల వాటా 60:40గా ఉండనుందన్నారు. ప్రాజెక్టు ద్వారా 7,567 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుందని, భూగర్భ పైప్‌లైన్లు, సెన్సార్‌లు, జీపీఎస్ సాయంతో ఆధునికంగా నీటి పంపిణీ చేపడతామన్నారు. పాచిపెంట, రామభద్రపురం మండలాలకు సాగునీటి లబ్ధి చేకూరనుందన్నారు.
News December 24, 2025
పారా యూత్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్‌ను సత్కరించిన మంత్రి కొండపల్లి

దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్ -2025 పోటీల్లో బాడ్మింటన్‌లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్ చంద్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈసందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను తన క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాకారుడుని మంత్రి శాలువాతో సత్కరించి, అభినందించారు.


