News March 19, 2025

సాలూరు: గిరిజనులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు

image

గిరిజనులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. ఈ నెల 15న తోణాం పంచాయతీ మద్దిన వలస గ్రామంలో పొలం గట్టు గొడవలో కోనేటి లక్ష్మణరావు ఆయన భార్య ఝాన్సీలపై దాడి చేసి దూషించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 13 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Similar News

News November 4, 2025

RITESలో 600 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. *ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 4, 2025

WGL: 6 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

image

సీసీఐ అవలంబిస్తున్న ఎల్1, ఎల్2, ఎల్3 అసమతుల్య జాబ్‌వర్క్ అలాట్‌మెంట్, స్లాట్ బుకింగ్ సమస్యల పరిష్కారం కోసం విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో ఈ నెల 6 నుంచి ఉమ్మడి WGL జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు TG కాటన్ ట్రేడర్స్ అండ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి ప్రకటించారు. సీసీఐ విధానంతో మిల్లర్ల మధ్య విభేదాలు తెచ్చి పరిశ్రమ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

News November 4, 2025

వాము పంట సాగు- అనువైన రకాలు

image

వాము పంటను ఏ నేలలోనైనా, ఏ వాతావరణంలోనైనా సాగు చేయవచ్చు. నల్లరేగడి నేలలో బాగా పండుతుంది. గుంటూరు లామ్ విడుదల చేసిన L.S-1, LTA-26, లామ్ వర్షా రకాలు మంచి దిగుబడినిస్తాయి. వాము పంటకాలం 150-160 రోజులు. వీటిలో లామ్ వర్షా బెట్ట పరిస్థితులను తట్టుకొని ఎకరాకు 4-5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. వాము పంట అధిక తేమ, నీటి ముంపును తట్టుకోలేదు. లోతట్టు నేలలు వాము సాగుకు అనుకూలం కాదు. మురుగునీటి వసతి ఉండాలి.