News January 25, 2025

సాలూరు: నేడు మంత్రి సంధ్యారాణి షెడ్యూల్ ఇదే

image

జిల్లాలో నేడు పార్వతీపురం, మక్కువ మండలాలలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పార్వతీపురం లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో నిర్వహించే జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు మక్కువ వెంగళరాయ సాగర్‌లో చేప పిల్లలను విడిచిపెట్టే కార్యక్రమంలో పాల్గొని, అనంతరం శంబర పోలమాంబ జాతర ఏర్పాట్లను పరిశీలిస్తారు.

Similar News

News February 27, 2026

టమాటా మిర్చి అ’ధర’హో.. ఒక్కరోజే రూ.10వేలు పెరిగింది

image

TG: టమాటా మిర్చి రకం రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వరంగల్(D) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇవాళ ఈ మిర్చి క్వింటా ధర ఏకంగా రూ.50,000 పలికింది. ఈ నెల 18న క్వింటా రూ.35,000, 19న రూ.36,000, 23న రూ.37,000, 25, 26న రూ.40,000 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇవాళ ఒక్క రోజే క్వింటాకు రూ.10,000 పెరిగింది. 9 రోజుల్లో క్వింటా టమాటా మిర్చి ధర రూ.15వేలు పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News February 27, 2026

మార్చి 16 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు: కలెక్టర్

image

ఉన్నత చదువులకు తొలి మెట్టైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివరాలు శుక్రవారం తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరీక్షలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండడంతో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు పాటు పడాలన్నారు.

News February 27, 2026

పార్వతీపురం: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 413 మంది గైర్హాజర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు DVEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్ధులు 840 మందికి 80 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,957 మందికి 333 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు.