News June 26, 2024

సాలూరు ప్రజలకు రైలు సౌకర్యం ఎప్పుడు?

image

సాలూరు నుంచి ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు 6 లైన్ల రహదారి తయారవుతుంది కానీ.. రైలు పట్టాలు సరిచేయడం లేదు. విద్యుదీకరణ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా రైలు మాత్రం పట్టాలెక్కడం లేదు. గత దసరాకు సాలూరు నుంచి విశాఖకు రైలు వేస్తున్నామని ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. కానీ ఇంతవరకు రియల్ రన్ లేదు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News July 1, 2024

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గోనున్న మంత్రి

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గోనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు సాలూరు పట్టణంలోని 21వ వార్డులోని గొల్లవీధి సచివాలయం, 10:30కు కందులపథం, మధ్యాహ్నం 12 గంటలకు మక్కువ మండలం కవిరిపల్లి, 3 గంటలకు పాచిపెంట మండలం మంచాడవలస, సాయంత్రం 4:30కు మెంటాడ మండలం గుర్లతమ్మిరాజుపేట సచివాలయంలో హాజరుకానున్నారు.

News June 30, 2024

విజయనగరం: రబ్బర్ డ్యాం దిగువన వ్యక్తి మృతి

image

కొమరాడ మండలం జంఝావతి రబ్బర్ డ్యాం దిగువున స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. కొమరాడ ఎస్ఐ నీలకంఠం తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం గరుడబిల్లికి చెందిన కలియ దాసు(60) బూర్జి‌వలస స్టోన్ క్రషర్‌లో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం పని ముగించుకుని స్నానానికి నదికి వెళ్ళిన దాసు మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని ఆదివారం గుర్తించి.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News June 30, 2024

మంత్రి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ వినతి 

image

గిరిజన ఆశ్రమ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ ఆదివారం వినతి పత్రం అందజేశారు. జీవోనం-3 ప్రకారం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, గి.సం.శాఖకు మంజూరైన డీఈవో, డివైఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 420 పండిట్ పోస్టులు అప్‌గ్రేడ్ జరిగేలా చూడాలని కోరారు. వారి వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.