News March 15, 2025
సాలూరు : మున్సిపల్ కమిషనర్ సరెండర్

సాలూరు మున్సిపల్ కమిషనర్ విహెచ్ సత్యనారాయణను సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. గురువారం రాత్రి మన్యం జిల్లా కలెక్టర్ నిర్వహించిన జూమ్ మీటింగ్ కమిషనర్ పాల్గొనకపోవడం, మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం తదితర కారణాల వలన సరెండర్ చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News July 7, 2025
KU పరిధిలో 2,356 ఇంజినీరింగ్ సీట్లు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 2,356 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని రెండు కాలేజీల్లో 780 సీట్లు ఉండగా.. నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 1,576 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,103 సీట్లను భర్తీ చేయనున్నారు. టీజీఎప్‌సెట్-2025 ఫస్ట్ ఫేజ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 8 వరకు అవకాశం ఉండగా.. వెబ్ ఆప్షన్లకు 10 వరకు గడువు ఉంది.
News July 7, 2025
దండేపల్లి: అత్తారింటి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

అత్తారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి మండలం గుడిరేవులో జరిగింది. ఎస్ఐ తహిసోద్దీన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రూపను భర్త, అత్తమామలు, సమీప బంధువులు వేధింపులకు గురి చేయడంతో ఆమె ఈనెల 5న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రూప తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News July 7, 2025
సిద్దిపేట జిల్లాలో 27 మంది సబ్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ

సిద్దిపేట జిల్లాలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న 27 మంది ఎస్ఐలను పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ అనురాధ ఉత్తర్వులు జారీచేశారు. రాజేశ్‌ను-సిద్దిపేట రూరల్, కరీనాకీర్తి రాజ్- దుబ్బాక, సౌజన్య- బెజ్జంకి, రఘుపతి, శ్రీరామ్, ప్రదీప్-గజ్వేల్, సమత-మిరుదొడ్డి, నవీన్-చేర్యాల, సైఫ్ ఆలీ-చిన్నకోడూరు, మానసను-రాయపోల్ తదితరులను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు.