News January 25, 2025

సాలూరు: వేగవతి బ్రిడ్జి కింద యువకుడి మృతదేహం

image

సాలూరులోని వేగావతి బ్రిడ్జి కింద యువకుడి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. మృతుడు గాంధీ నగర్‌కు చెందిన తుపాకుల శివశంకర్‌గా పోలీసులు గుర్తించారు. వేగావతి నది ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన శివ అనుమానాస్పద రీతిలో చనిపోయి ఉండడంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తాగిన మైకంలో నీటిలో మునిగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 9, 2026

విశాఖ: GVMC వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

విశాఖలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మజ్జి రామారావు (59) అనే వ్యక్తిని తోటగురువు జంక్షన్‌లో జీవీఎంసీకి చెందిన క్లాప్ (CLAP) వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

News January 9, 2026

నెల్లూరు: ‘భోగి మంటల్లో అవి వేస్తే ప్రమాదం’

image

టైర్లు, ప్లాస్టిక్ వస్తువులతో భోగి మంటలలో వేయొద్దని దుత్తలూరు PHC వైద్యులు సయ్యద్ ఆయూబ్ అప్సర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న సంక్రాంతి పండగల్లో భాగంగా భోగి మంటల్లో టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు వేస్తే పర్యావరణం దెబ్బతినడమే కాకుండా కేన్సర్, టీబీ, చర్మ, కంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. సంప్రదాయబద్ధంగా పండగలను చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News January 9, 2026

మడకశిరలో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. 3 రోజులుగా చలి తీవ్రత పెరగడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం మడకశిరలో 9.3 డిగ్రీలు నమోదయ్యాయి. సోమందేపల్లిలో 10.2 డిగ్రీలు, తనకల్లు 10.3, రొద్దం 10.5, గుడిబండ, అమడగూరు 11.1, ఓడీ చెరువు 11.2, అమరాపురం 11.4, రాప్తాడు 11.5, పెనుకొండ 11.6, గోరంట్ల 11.7, చిలమత్తూరు, ఉరవకొండ 11.8 డిగ్రీలు నమోదయ్యాయి. చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు.