News January 24, 2025
సాలూరు: ‘సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇవ్వాలి’

భూమి సాగు చేస్తున్న దళితులుకు పట్టాలివ్వలని, దళితులుపై దౌర్జన్యం చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు కొల్లు గంగు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సాలూరు మండలం కరాసవలస పరిధిలో గుర్రప్ప వలస రెవెన్యూలో 5 ఎకరాలు సాగు చేస్తున్న దళితులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని పేదల మధ్య తగాదాలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 27, 2025
ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది

శీతాకాలంలో పాడి పశువుల పాలు పితికే సమయాన్ని కూడా మార్చుకుంటే మంచిది. చలికాలంలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలను ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పితకడం మంచిదని పశు సంరక్షణా అధికారులు సూచిస్తున్నారు. అలాగే చలిగా ఉండే ఉదయం మరియు రాత్రివేళల్లో పశువులకు ఎండుగడ్డి, పొడి దాణా అందించాలి. పచ్చిగడ్డిని ఉదయం 11 గంటల ప్రాంతంలో అందిస్తే మంచిది.
News December 27, 2025
విజయనగరం జిల్లా ప్రజలకు GOOD NEWS

జిల్లాలో NTR భరోసా పింఛన్లను జనవరి 1కు బదులు డిసెంబర్ 31న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 7 నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారన్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి జిల్లాలో 2,71,697 మంది లబ్ధిదారులకు రూ.116.25 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నిధులు 30న బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, సిబ్బంది ముందుగానే సిద్ధంగా ఉండాలన్నారు.
News December 27, 2025
ప.గో: మాజీ డిప్యూటీ సీఎం.. జాడలేరు!

మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు నేత ఆళ్ల నాని వ్యవహారశైలి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఓటమి తర్వాత టీడీపీలో చేరిన ఆయన అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. తనను నమ్ముకున్న అనుచరులకు, టీడీపీ శ్రేణులకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. పార్టీ జిల్లా అధ్యక్షుడిని సైతం కలవకపోవడంతో ఆయన పార్టీ మార్పు కేవలం రక్షణ కోసమేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


