News September 18, 2025
సాహిత్య పురస్కారాలకు ముగ్గురు కవులు ఎంపిక

ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు కవులు సాహిత్య పురస్కారాలకు ఎంపిక య్యారు. NKP మండలానికి చెందిన సాగి కమలాకరశర్మ ఇటీవల దివాకర్ల వేంకటావధాని సాహిత్య పురస్కారానికి ఎంపిక కాగా.. నల్గొండకు చెందిన ఎస్. రఘు, సూర్యాపేట జిల్లా అనంతారం గ్రామానికి చెందిన బైరెడ్డి కృష్ణారెడ్డి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల సాహిత్యకారులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News September 18, 2025
ఏలూరు: రోడ్డు పక్కన గాయాలతో బాలుడు.. ఆచూకీ లభ్యం

ఏలూరులోని వట్లూరు వద్ద బుధవారం రాత్రి రోడ్డు పక్క పొలాల్లో గాయాలతో పడి ఉన్న బాలుడి ఆచూకీ లభించింది. విజయవాడ రామవరప్పాడు గణేశ్ నగర్‌కు చెందిన విజయ్ కుమార్ (14) గా గుర్తించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అతను తిరిగి వెళ్లలేదు. దీంతో అతని తల్లి పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాలుడిని గుర్తించారు. కాగా బాలుడు ఏలూరు ఎలా? ఎవరితో వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది.
News September 18, 2025
సిరిసిల్ల: జిల్లాకు 10,234 ఇందిరమ్మ ఇండ్లు

సిరిసిల్ల జిల్లాకు 10,234 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్లలోని కరెక్టరేట్లో బుధవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం 10,234 ఇండ్లు మంజూరవ్వగా, 5,308 మార్కింగ్, 2,549 బేస్మెంట్ స్థాయికి, 618 గోడల వరకు, 285 రూఫ్ వరకు, 2 ఇండ్ల నిర్మాణం మొత్తం జరిగిందని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News September 18, 2025
అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.