News November 10, 2025

సింగపూర్‌ వెళ్లనున్న పాలకొండ టీచర్

image

రాష్ర్ట ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచి, అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటిస్తున్న పాలకొండ హైస్కూల్ సంస్కృత ఉపాధ్యాయుడు బి.శంకరరావును ప్రభుత్వం సింగపూర్ పంపిచనుంది. రాష్ర్టంలో మరికొందరు ఉపాధ్యాయులు, మంత్రి లోకేశ్‌తో పాటు అక్కడి ప్రముఖులతో పాఠశాలలో విద్యా విధానాన్ని అధ్యయనం చేయనున్నారు. ఈనెల 27న ప్రభుత్వం ఉపాధ్యాయులను సింగపూర్ పంపించనుంది. డిసెంబర్ వరకు ఉపాధ్యాయ బృందం ఢిల్లీలో పర్యటించనుంది.

Similar News

News November 10, 2025

అల్లూరి జిల్లాలో 1.69లక్షలు మందికి పరీక్షలు: DEO

image

అల్లూరి జిల్లాలో 2904 ప్రభుత్వ పాఠశాలల్లో 1.69లక్షల మంది విద్యార్థులకు సోమవారం నుంచి సమ్మేటివ్- 1 పరీక్షలు ప్రారంభం అయ్యాయని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. పాడేరు గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో జరుగుతున్న పరీక్షను ఆయన పరిశీలించారు. ప్రతీ పాఠశాలలో క్రమశిక్షణతో పరీక్షలు నిర్వహించాలని టీచర్స్‌ను ఆదేశించారు. ఈ పరీక్షలు ఫలితాలు ఆధారంగా విద్యార్థికి చదువు చెప్పాలన్నారు.

News November 10, 2025

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

✦ విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ఐటీ పార్క్, రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
✦ ఓర్వకల్లులో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రీస్‌కు 50ఎకరాలు, సిగాచీ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంటుకు 100Acre, అనకాపల్లి(D)లో డోస్కో ఇండియాకు 150Acre, అనంతపురంలో TMT బార్ ప్లాంటుకు 300Acre, నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా గ్రూపుకు భూమి కేటాయింపు
✦ కృష్ణా(D) బాపులపాడులో వేద ఇన్నోవేషన్ పార్క్(40Acre) ఏర్పాటు

News November 10, 2025

NZB: అజారుద్దీన్‌ను కలిసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్

image

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులై సోమవారం మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్‌ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేయాలని అజారుద్దీన్‌ను తాహెర్ బిన్ హందాన్ కోరారు.