News March 22, 2024

సింగరాయకొండ: ముగ్గురు వాలంటీర్లపై వేటు

image

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ముగ్గురు వాలంటీర్లపై తొలగింపులు కొనసాగుతున్నాయి. బుధవారం సింగరాయకొండలో మంత్రి సురేశ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పొన్నూరి సురేశ్, సిరిమల్లె మణికంఠ, దేపూరి శివయ్య పాల్గొన్నారు. దీనిపై అధికారులు స్పందించి.. విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో నగేశ్ కుమారి చెప్పారు. ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో తొలగింపులు జరిగాయి.

Similar News

News March 2, 2026

ప్రకాశం: కెనాల్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని కేసీ కెనాల్‌లో ఆదివారం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన ఒంగోలు యువకుడు హేమంత్ (17) మృతదేహం లభ్యమైంది. పోలీస్, అగ్నిమాపక సిబ్బందితో పాటు డ్రోన్ టీం సాయంతో గాలింపు చేపట్టగా, సోమవారం ఈర్నపాడు దగ్గర శవం దొరికినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

News March 2, 2026

మార్కాపురంలో కొత్త కొలువులు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

image

మార్కాపురంలోని కొత్త వన్ స్టాప్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి పద్మావతి ఆదివారం తెలిపారు. అర్హత గల మహిళా అభ్యర్థులు మార్చి 11 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు జిల్లా వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు తీసుకుని, సర్టిఫికెట్లు జతచేసి జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

News March 2, 2026

ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి: మంత్రి స్వామి

image

అంగన్వాడీ కార్యకర్తలు, చిరుద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్వామి ఆదివారం తెలిపారు. చరిత్రలో తొలిసారిగా అంగన్వాడీ వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత CM చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.