News December 12, 2024
సింగరాయకొండ: 800 మందిని మోసం చేసిన కి‘లేడీ’

మండలంలోని ఉలవపాడుకు చెందిన కామంచి కోటి అనే వ్యక్తి నందిని పొదుపు సంస్థను ప్రారంభించారు. ఈ పొదుపు సంఘాల్లో సింగరాయకొండకు చెందిన పలువురిని చేర్చుకొని 800 మంది చేత రూ.50 లక్షల వరకు కట్టించాడు. కోటి మరణించగా.. అతని భార్య నందిని పొదుపు సంస్థను నడుపుతూ వచ్చింది. గత కొన్ని నెలలుగా సంస్థను మూసివేయడంతో డబ్బులు కట్టిన వారు మోసపోయామని గ్రహించి న్యాయం కోసం సింగరాయకొండ ఎస్సై మహేంద్ర వద్దకు చేరారు.
Similar News
News December 16, 2025
వాట్సాప్ గవర్నెన్స్‌తో ప్రకాశం పోలీస్ మరింత ముందుకు!

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందే పోలీస్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు కోరారు. ప్రకాశం జిల్లా ఐటీ విభాగం పోలీసులు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందే పోలీస్ సేవలపై ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఈ చలానా చెల్లింపులు, ఎఫ్ఐఆర్ డౌన్లోడ్, కేసుల స్థితిగతులను తెలుసుకొనే అవకాశం ఉందన్నారు. అందరూ 9552300009 నంబర్ సేవ్ చేసి, HI అని మెసేజ్ చేయాలన్నారు.
News December 16, 2025
ప్రకాశం జిల్లాకు జోన్-4 కేటాయింపు

APలోని 26 జిల్లాలను జోన్‌ల వారీగా విభజించే క్రమంలో ప్రకాశం జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.
News December 16, 2025
ప్రకాశం: పరారైన ఖైదీ.. 24 గంటల్లో పట్టుబడ్డాడు

ఒంగోలు బస్టాండ్ నుంచి ఎస్కార్ట్ కళ్లుగప్పి పరారైన ఖైదీని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జైలు నుంచి వైజాగ్‌కు ఇరువురు నిందితులను తీసుకువెళ్తుండగా ఒంగోలు బస్టాండ్ వద్దకు ఆదివారం రాత్రి ఎస్కార్ట్ పోలీసులు చేరుకున్నారు. అక్కడ వారి కళ్లుగప్పి శ్రీనివాసరావు అనే నిందితుడు పారిపోయాడు. కాగా ఒంగోలు వన్‌టౌన్ PSలో ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.


