News February 20, 2026
సింగరేణిలో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సింగరేణి సంస్థలో ఇంటర్నల్ అభ్యర్థులతో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. 17 జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ (టీ అండ్ ఎస్ గ్రేడ్-3) పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 20న మధ్యాహ్నం 12 నుంచి మార్చి 4న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Similar News
News February 21, 2026
నల్లగొండ: 14 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

నల్లగొండ 5వ జోన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించారు. నల్లగొండ, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 14 మందికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి పొందిన సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సంతోష్ సూచించారు.
News February 21, 2026
నల్లగొండ: బతుకుతెరువుకు వంద మార్గాలు..!

పనిచేయాలనే తపన ఉండాలే కానీ.. బతుకుతెరువుకు వంద మార్గాలు ఉన్నాయని నల్లగొండ యువత నిరూపిస్తోంది. స్థానికంగా ఓ మార్ట్ వద్ద డెలివరీ బాయ్స్‌గా చేరేందుకు యువత క్యూ కడుతున్నారు. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలే దీనికి ప్రధాన కారణం. డెలివరీ పాయింట్ దూరాన్ని బట్టి చెల్లింపులు ఉన్నాయి. 1.3 కిలోమీటర్ల లోపు ప్రతి డెలివరీకి రూ.35, ఆ పైన దూరం ఉంటే రూ.45 చొప్పున సంస్థ అందిస్తోంది.
News February 21, 2026
అమెరికా అమ్మాయి.. మంచిర్యాల అబ్బాయి..!

అమెరికా న్యూయార్క్‌కు చెందిన అమ్మాయికి మన సింగరేణి ప్రాంతానికి చెందిన అబ్బాయితో శుక్రవారం హిందూ సాంప్రదాయంగా వివాహం జరిగింది. కోల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన గంగిపెల్లి ప్రణీత్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడి అమ్మాయి లవీనతో ప్రేమలో పడ్డాడు. పెళ్లికి పెద్దలను ఒప్పించి అమ్మాయి కోరిక మేరకు హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అమెరికా అమ్మాయిని చూసేందుకు పలువురు ఉత్సాహం చూపారు.


