News February 18, 2025

సింగరేణిలో పలువురు జీఎంల బదిలీ

image

సింగరేణిలో వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న జీఎంలు, అడిషనల్ జీఎంలను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బెల్లంపల్లి ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ శ్రీరాంపూర్ ఏరియాకు, జీఎం కార్పొరేట్ ఎం.విజయభాస్కర్ బెల్లంపల్లికి, జైపూర్ ఎస్టీపీపీ జీఎం ఎన్వీ.రాజశేఖర్ రావు జీఎం (మార్కెటింగ్), మందమర్రి ఏరియాలోని కేకే గ్రూప్ అడిషనల్ జీఎం వి.రామదాసును జీఎం(కార్పొరేట్)కు బదిలీ అయ్యారు.

Similar News

News March 1, 2026

MGM వద్ద ‘శిశు సంరక్షణ’ ప్రతిమ ఆవిష్కరణ

image

​వరంగల్ నగరంలోని MGM జంక్షన్ వద్ద రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన ‘శిశు సంరక్షణ’ ప్రతిమను మంత్రి కొండా సురేఖ, మేయర్ సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్, హన్మకొండ కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్‌పాయ్, కార్పొరేటర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నగర సుందరీకరణలో భాగంగా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా ఈ కూడలిని తీర్చిదిద్దడం విశేషం.

News March 1, 2026

సిద్దిపేట: సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

image

గోవాలో జరిగిన 22వ దక్షిణ భారత జాతీయ సీనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటింది. తెలంగాణ పురుషుల జట్టు తృతీయ స్థానంలో నిలిచినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ శర్మ తెలిపారు. సిద్దిపేటకు చెందిన పూజ(ఉత్తమ ఫీచర్), ప్రియాంక(ఉత్తమ క్రీడాకారిణి) అవార్డులు అందుకున్నారు. క్రీడాకారుల ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

News March 1, 2026

పెద్దపల్లి: 45 ఏళ్లకు ఇల్లు చేరిన ‘మల్లోజుల’

image

ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు 45 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఆదివారం పెద్దపల్లిలోని తన నివాసానికి అతడి భార్య తారతో కలిసి చేరుకున్నారు. సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజులను సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. 1980లో ఉద్యమ బాట పట్టిన మల్లోజుల మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించడం గమనార్హం.