News April 1, 2025

సింగరేణి ఆర్థికంగా ముందుకెళ్లాలి: శ్రీరాంపూర్ జీఎం

image

సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత ముందుకు సాగాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. జీఎం కార్యాలయంలోని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా లక్ష్మిపూజ నిర్వహించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులందరిపైనా ఉండాలని కోరారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెరగాలని కోరారు.

Similar News

News November 9, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 102 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 102 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 64, సెంట్రల్ జోన్ పరిధిలో 16, వెస్ట్ జోన్ పరిధిలో 9, ఈస్ట్ జోన్ పరిధిలో 13 కేసులు నమోదయ్యాయి.

News November 9, 2025

HYD: తండ్రి మరణం తట్టుకోలేక యువతి సూసైడ్

image

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక సౌమ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.బ్లాక్ నంబర్–4 అపార్ట్‌మెంట్స్‌లోని మూడో అంతస్తు నుంచి దూకిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు నిలువలేదు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.