News November 8, 2025

సింగరేణి ఉచిత ప్రమాద బీమా దేశానికే ఆదర్శం: CMD

image

కొత్తగూడెం: సింగరేణిలో ఉద్యోగులు, ఒప్పంద కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రారంభించిన ఉచిత ప్రమాద బీమా పథకం దేశంలోనే తొలిసారిగా అమలు చేసి, ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలిచిందని సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇప్పుడు ఈ పథకాన్ని తమ సంస్థల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. ఈ పథకం అమలుకు సహకరించిన బ్యాంకులతో ఆయన సమావేశం నిర్వహించారు.

Similar News

News November 9, 2025

VJA: దుర్గగుడిలో దసరాను తలపించిన కార్తీక రద్దీ

image

ఇంద్రకీలాద్రిపై కార్తీక ఆదివారం సందర్భంగా దసరా ఉత్సవాన్ని తలపించేలా భక్తుల రద్దీ కిక్కిరిసింది. వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు ఈ రద్దీ కొనసాగింది. ఈవో శ్రీనా నాయక్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ, సీసీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు గమనించారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూశారు.

News November 9, 2025

ఆడపిల్ల పెళ్లికి రూ.65వేల సాయం: యోగి

image

యూపీలో భవన నిర్మాణ కార్మికులకు యోగి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘కన్యా వివాహ్ సహాయతా యోజన’ కింద ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేయనుంది. సాధారణ వివాహానికి రూ.65వేలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీకి రూ.75వేలు, సామూహిక వివాహాలకు రూ.85వేలు ఇవ్వనుంది. వీటితో పాటు వేడుక ఖర్చులకు రూ.15వేలు అదనంగా అందించనుంది. భవన నిర్మాణ కార్మికులు సమాజానికి వెన్నెముక అని యోగి కొనియాడారు.

News November 9, 2025

జూబ్లీహిల్స్ పోటీలో నలుగురు మహిళా అభ్యర్థులు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో నలుగురు మహిళలు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో పాటు సోషలిస్ట్ పార్టీ నుంచి సుభద్రారెడ్డి, ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇంక్విలాబ్-ఏ-మిల్లత్ నుంచి షేక్ రఫత్ జహాన్, స్వతంత్ర అభ్యర్థి అస్మా బేగం పోటీ చేస్తున్నారు. నలుగురు అభ్యర్థుల్లో అస్మాబేగం పిన్న వయస్కురాలు.