News May 17, 2024

సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుకు సాంకేతిక సమస్య

image

సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించగా రెండు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఆన్లైన్ సేవలు ముందుకు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

Similar News

News October 5, 2024

కాటారం:అరుదైన అటవీ జంతువును తరలిస్తున్న ముఠా పట్టివేత?

image

అటవీ జంతువుల్లో అరుదుగా లభించే ‘అలుగు’ను తరలిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది. పక్కా సమాచారం మేరకు అలుగును తరలిస్తున్న ముఠాను కాటారం మండలం మేడిపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయసమాచారం. ఈముఠాలో కాటారం సబ్ డివిజన్‌కు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు, మరో ఇద్దరూ ఉన్నట్లు తెలిసింది. కాగా సదరు అలుగు విలువ రూ. 70లక్షల నుంచి రూ.కోటి పైనే ఉంటుందని సమాచారం.

News October 4, 2024

లక్కీ డ్రా నిర్వాహకులపై కేసు నమోదు: చందుర్తి CI

image

బహమతుల ఆశ చూపెడుతూ లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా దుర్గమ్మ విగ్రహాల వద్ద లయన్స్ యూత్ వారు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల వద్ద నుంచి ఒక్కొక్క లక్కీ డ్రా టికెట్ రూ.99 వసూలు చేస్తూ డ్రాలో పాల్గొనాలని ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News October 4, 2024

MLC ఓటర్ నమోదుపై రాజకీయ నాయకులతో సమావేశం

image

నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై కరీంనగర్ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీఓ మహేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితాపై సలహాలు, సూచనలు చేశారు. డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.