News April 5, 2026
సింగరేణి కార్మికులకు రూ.10 లక్షల ఉచిత బీమా

సింగరేణి కార్మికుల సంక్షేమం దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రమాదవశాత్తు జరిగే మరణాలకే కాకుండా, సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా కల్పించేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కుదిరిన ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ నెల(APR) 1వ తేదీ నుంచే ఈ విధానం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. సంస్థ చరిత్రలో సహజ మరణానికి ఇంత భారీ బీమా వర్తించడం ఇదే తొలిసారి కావడంతో కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News April 5, 2026
కామారెడ్డిలో అధికారికంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, RDO, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఉమారాణి ఉన్నారు.
News April 5, 2026
హిమంత క్షమాపణ కోరినా వదిలేది లేదు: రాహుల్

దేశంలోనే అత్యంత అవినీతి పరుడైన CM హిమంత అని INC అగ్రనేత రాహుల్ విమర్శించారు. ఆయన క్షమాపణ కోరినా వదలబోమని, తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ మరణానికి బాధ్యులైన వారితో CMకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించి, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి హిమంత ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
News April 5, 2026
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: కలెక్టర్

అనంతపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం జరుగునున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 6న సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.


