News September 11, 2025
సింగరేణి కార్మికుల సమస్యలపై INTUC సమావేశం

HYDలోని INTUC కార్యాలయంలో సింగరేణి కార్మికుల సమస్యలపై యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్(RGM) ఆధ్వర్యంలో గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులపై యాజమాన్యం అవలంబిస్తోన్న మొండి వైఖరిని ఎదుర్కునే విధానాలపై చర్చించారు. కార్మికులకు లాభాల వాటా, కాంట్రాక్టు కార్మికుల బోనస్, IT మాఫీ అంశాలను సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 11, 2025
కరీంనగర్: తల్లికి 3 నెలల డబ్బులు చెల్లించాలని ఆదేశం

శంకరపట్నం మండలం మొలంగూర్ వాసి మరాఠీ రాజమ్మ తన కుమారుడు పట్టించుకోవడంలేదని డిసెంబర్ 2024లో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో నెలకు రూ.6 వేలు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. గురువారం డీవీసీ కౌన్సిలర్ పద్మావతి, DHEW కవిత విచారణలో 3 నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదని రాజమ్మ తెలపగా తల్లి ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేయాలని కుమారుడిని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సమ్మయ్య, పోలీసులు ఉన్నారు.
News September 11, 2025
బ్రహ్మోత్సవాలకు సమష్టిగా పనిచేయాలి: TTD ఈవో

శ్రీవారి బ్రహ్మోత్సవాలను కన్నులపండువగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా పని చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 నుంచి జరగునున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై గురువారం అన్నమయ్య భవన్‌లో శాఖల వారీగా ఆయన సమీక్షించారు. పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కోరారు.
News September 11, 2025
VZM: నేలబావిలో పడి వ్యక్తి మృతి

విజయనగరం మండలం రాకొడు గ్రామానికి చెందిన పి.రామారావు (35) ప్రమాదవశాత్తు నేలబావిలో పడి గురువారం మృతి చెందాడు. పశువుల మేతకు గడ్డి కోసం వెళ్లి నేలబావిలో జారి పడినట్లు మృతుని భార్య సంధ్య పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయనగరం రూరల్ ఎస్‌ఐ వి.అశోక్ కుమార్ తెలిపారు.