News November 8, 2024
సింగరేణి: ‘రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి’
సింగరేణి వ్యాప్తంగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే ఈ ఏడాది టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ నిర్ణయించింది. ఇంకా 5 మాసాలు ఉన్నప్పటికీ నెలకు 7.63 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తేనే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాయి. సమిష్టిగా ఉద్యోగులు కృషి చేయాలని కోరుతున్నారు.
Similar News
News November 24, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ చొప్పదండి మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్పల్లి మండలం జగ్గాసాగర్ లో అగ్ని ప్రమాదం. @ తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ. @ గంభీర్రావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన కేంద్రమంత్రి బండి సంజయ్. @ కొడిమ్యాల మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల అడిషనల్ కలెక్టర్.
News November 23, 2024
ధర్మపురి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో ధర్మపురిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శుక్రవారం 2,18,709 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో టికెట్ల ద్వారా 1,11,733 రూపాయలు, ప్రసాదాల ద్వారా 84,090 రూపాయలు, అన్నదానం కోసం 22,886 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
News November 23, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ మేడిపల్లి మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. @ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు చిగురుమామిడి విద్యార్థిని. @ మెట్పల్లి, మల్లాపూర్ మండలాలలో వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల అడిషనల్ కలెక్టర్. @ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను పెంచాలన్న జగిత్యాల కలెక్టర్. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ తంగళ్ళపల్లి మండలంలో గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.