News January 7, 2026

సింగరేణి హాకీ పోటీల్లో శ్రీరాంపూర్‌ జట్టు విజయం

image

డబ్ల్యూపీఎస్‌ & జీఏ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి స్థాయి హాకీ పోటీలు ఈ రోజు ముగిశాయి. ఫైనల్స్‌లో శ్రీరాంపూర్‌ జట్టు, మందమర్రి, బెల్లంపల్లి ఏరియా జట్టు తలపడ్డాయి. ఈ పోటీల్లో శ్రీరాంపూర్‌ జట్టు విజయం సాధించింది. ముగింపు వేడుకలకు ఆర్జీ 1 జీఏం డీ.లలిత్‌ కుమార్‌ హాజరై ట్రోఫీ అందజేశారు. శ్రీరాంపూర్‌ జట్టు కోల్‌ ఇండియా పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.

Similar News

News February 20, 2026

ఆయేషా మీరా హత్య కేసులో కీలక ఆదేశాలు

image

AP: ఆయేషా మీరా హత్య కేసులో వైద్య బృందం సేకరించిన అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని VJA సీబీఐ కోర్టు పేర్కొంది. FEB 27న తెనాలిలో మతపరమైన ఆచారాలతో అంత్యక్రియలు చేయాలని, అందుకు వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రీపోస్ట్‌మార్టం కోసం 2019లో తెనాలి కబరిస్తాన్ నుంచి ఆయేషా అవశేషాలను సేకరించారు. 2007లో విజయవాడ శివార్లలోని ఓ బీఫార్మసీ కాలేజ్ హాస్టల్లో ఆయేషా హత్యకు గురైన విషయం తెలిసిందే.

News February 20, 2026

వరంగల్: తనిఖీలు లేకనే .. ఉపాధ్యాయుల గైర్హాజరు!

image

ప్రభుత్వ పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు లేనందునే ఉపాధ్యాయులు విధులకు హాజరై డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. జిల్లాలోని నెక్కొండ మండలంలో ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డీఈవో రంగయ్య నాయుడు శుక్రవారం సస్పెండ్ చేసిన క్రమంలో విద్యాశాఖ అధికారులు ఇన్నాళ్లకు మేల్కొన్నారా..!? అంటున్నారు. కొందరు హెచ్ఎంల కారణంగానే టీచర్లు డుమ్మా కొడుతున్నట్లు చర్చ సాగుతోంది.

News February 20, 2026

విజయవాడలో మిస్సైన పిల్లలు గుజరాత్‌లో..!

image

విజయవాడ భవానీపురంలో <<19188253>>మిస్సైన ఇద్దరు పిల్లల కేసు<<>> సుఖాంతమైంది. ట్యూషన్‌కు వెళ్లకుండా ఇంట్లోని నగదు తీసుకుని పారిపోయిన మేరారామ్ (12), ఉమారామ్ (13) ఆచూకీ లభ్యమైంది. గురువారం విజయవాడ నుంచి ముంబైకి వెళ్లిన చిన్నారులు, అక్కడి నుంచి గుజరాత్‌కు వెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు క్షేమంగా దొరకడంతో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.