News August 23, 2025

సింగూర్ ఔట్‌ఫ్లో 9,902 క్యూసెక్కులు

image

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి ఇవాళ సాయంత్రం వరకు 11,414 క్యూసెక్కులు వరద జలాలు వచ్చి చేరినట్లు నీటిపారుదల శాఖ డివిజన్ అధికారి నాగరాజు తెలిపారు. ఎగువ నుంచి వరద తగ్గడంతో తెరిచిన నాలుగు గేట్లు క్లోజ్ చేసి కేవలం ఒక్క గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. స్పిల్ వే, జెన్కో కరెంట్, మిషన్ భగీరథ, HMWS, నీటి ఆవిరి కలిపి మొత్తం 9,902 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో కొనసాగుతుందన్నారు.

Similar News

News August 24, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 24, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.46 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.45 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.36 గంటలకు
✒ ఇష: రాత్రి 7.50 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 24, 2025

ఆ బిల్లుకు PM అతీతం కాకూడదన్నారు: కిరణ్ రిజుజు

image

130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు PM అతీతం కాకూడదని మోదీ చెప్పినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ‘బిల్లు నుంచి ప్రధానికి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను తిరస్కరిస్తున్నానని మోదీ క్యాబినెట్‌కు చెప్పారు. ప్రధాని కూడా ఒక పౌరుడేనని, ఆయనకు ప్రత్యేక రక్షణ అవసరంలేదని చెప్పారు. అత్యధిక సీఎంలు మన పార్టీ వాళ్లే ఉన్నారని, వాళ్లు తప్పు చేస్తే పదవిని వదులుకోవాల్సిందే అని స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు.

News August 24, 2025

ఎస్.రాయవరం: మూడు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన విజయ్

image

ఎస్.రాయవరం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన సుంకరణం విజయ్ డీఎస్సీలో సత్తా చాటాడు. స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)లో 94.7 మార్కులు, పీజీటీ (మ్యాథ్స్)లో 78.5 మార్కులు, టీజీటీ (మ్యాథ్స్)లో 87.3 మార్కులు సాధించాడు. ఈ మూడు కేటగిరిల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. పీఆర్టీయూ ఉపాధ్యాయ బృందం జిల్లా ప్రతినిధి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం విజయ్‌ను సత్కరించి అభినందించారు.