News July 22, 2024

సింగూర్ ప్రాజెక్టులో చేరుతున్న 1270 క్యూసెక్కుల వరద

image

ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన సింగూర్‌కు స్వల్ప వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో జలాశయానికి 1270 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని ఏఈ మహిపాల్ రెడ్డి సోమవారం తెలిపారు. సింగూరు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 TMCలు కాగా ప్రస్తుతం 13.702 TMCల నీరు ఉంది. ప్రస్తుతం 391 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.

Similar News

News October 28, 2025

మెదక్ జిల్లాకు కొత్తగా ఏడుగురు ఎంపీడీవోలు

image

మెదక్ జిల్లాకు కొత్తగా ఏడుగురు ఎంపీడీవోలు నియామకం అయ్యారు. జెడ్పీలో రిపోర్ట్ చేసిన అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిశారు. కొత్తగా కేటాయించిన వారు ఎంపీడీఓలుగా తూప్రాన్-శాలిక తేలు, నార్సింగి-ప్రీతి రెడ్డి, హవేలీఘన్పూర్-
వలుస శ్రేయంత్, చిలిపిచేడ్- బానోత్ ప్రవీణ్, అల్లాదుర్గ్- వేద ప్రకాశ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సీఈఓ ఎల్లయ్య ఉన్నారు.

News October 28, 2025

ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఐఈఓ మాధవి

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి(డీఐఈఓ) మాధవి సూచించారు. సోమవారం ఆమె వెల్దుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, తరగతి గదులను పరిశీలించారు. ఫిబ్రవరిలో జరగనున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకొని సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.

News October 28, 2025

అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది: అదనపు ఎస్పీ

image

విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని, వారి సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. రేగోడు పోలీసుల ఆధ్వర్యంలో పోచారం గ్రామానికి చెందిన అమరవీరుడు హెడ్ కానిస్టేబుల్ రాములు ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాములు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.