News April 7, 2025
సింహపురి ప్రీమియం లీగ్ ప్రారంభం

నెల్లూరు సమీపంలోని బుజబుజ నెల్లూరు సీఐఏ క్రికెట్ అకాడమీలో సింహపురి ప్రీమియర్ లీగ్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్ పి.విజయ్‌కుమార్, మదీనా ఇంతియాజ్ తదితరులు హాజరయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ గూడూరు జట్టు 19.2 ఓవర్లలో 10 వికెట్లకు 139 పరుగులు సాధించింది. ఆత్మకూర్ రేంజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు సాధించి ఓడిపోయింది.
Similar News
News April 8, 2025
NLR: పోలీసులపై పర్వత రెడ్డి విమర్శలు

నెల్లూరు జిల్లా పోలీసులు అనాలోచితంగా, అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఏదో రకంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందన్నారు. నాయకులకే రక్షణ లేకపోతే ప్రజల సంగతి ఏంటని ప్రశ్నించారు.
News April 8, 2025
నెల్లూరు: దొంగలు వస్తారు.. జాగ్రత్త!

నెల్లూరు జిల్లాలో ఇటీవల దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. పడుగుపాడు పంచాయతీలో మధుసూదనరావు, దయాకర్ ఇళ్లకు తాళాలు వేసి HYD వెళ్లగా ఆదివారం రాత్రి నగదు, బంగారం దోచుకెళ్లారు. కోవూరు శాంతినగర్‌కు చెందిన సురేశ్ రెడ్డి ఇంట్లో నిద్రిస్తుండగానే రూ.20వేలు చోరీ చేశారు. సెలవులకు వెళ్లే వాళ్లు, రాత్రిపూట ఇంటి బయట నిద్రించే వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. LHMS సేవలు వాడుకోవాలని కోరుతున్నారు.
News April 8, 2025
నెల్లూరు: నమ్మించి మోసం చేశాడు..!

కావలి ముసునూరుకు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని గుడ్లూరు పరిధికి చెందిన మహిళ సోమవారం ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు తన వద్ద రూ.3 లక్షల నగదు తీసుకున్నాడని, శారీకరంగా కలిశాక పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేస్తున్నాడని వాపోయింది. పోలీసులు విచారించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.