News March 27, 2025
సింహాచలంలో అప్పన్న స్వామికి నిత్య కళ్యాణం

సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామికి గురువారం ఉదయం నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. బెల్లం, జీలకర్రతో పాటు ఊరేగిచారు. 108 స్వర్ణ పుష్పాలతో స్వామివారిని పూజించి భక్తులకు వేదాశ్వీరచనాలు, శేష వస్త్రాలు అందజేశారు. భక్తులు భారీగా తరలివచ్చారు. ఈవో సుబ్బారావు ఇతర సిబ్బంది పర్యవేక్షించారు. అన్నదానం ఏర్పాట్లు చేపట్టారు.
Similar News
News December 13, 2025
విశాఖ వ్యాప్తంగా 336 దుకాణాల తొలగింపు

విశాఖలోని 8 జోన్లలో రహదారిపై ఆక్రమణల తొలగింపును జీవీఎంసీ శనివారం చేపట్టింది. తగరపువలస, బోయపాలెం, సమతా కాలేజీ, లీల మహల్, కంచరపాలెం, గాజువాక, శ్రీనగర్, సుజాతనగర్ ప్రాంతాల్లో రహదారులపై ఉన్న 336 దుకాణాలను ‘ఆపరేషన్ లంగ్స్’ పేరిట తొలగించామని చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ తెలిపారు. ప్రజల రవాణా సౌకర్యాలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల మేరకు తొలగింపులు చేపడుతున్నామని చెప్పారు.
News December 13, 2025
AU అల్యుమ్ని అనేది ఓ గొప్ప గుర్తింపు: ఆర్పీ పట్నాయక్

AU ‘వేవ్స్–2025’లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాల్గొన్నారు. ఇక్కడికి రాగానే తనకు క్యాంపస్ డేస్ గుర్తుకొచ్చాయని భావోద్వేగమయ్యారు ‘ఎక్కడ చదివినా.. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా ఒక్కసారి AUలో చదివిన తర్వాత అన్నీ మరిచిపోయి మీరు AU స్టూడెంట్ అయిపోతారు. AU అల్యుమ్ని అనేది ఓ గొప్ప గుర్తింపు’ అని పేర్కొన్నారు. సోషల్ వింగ్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు ముందుకు రావాలని కోరారు.
News December 13, 2025
15న విశాఖలో వైసీపీ కోటి సంతకాల ర్యాలీ: కేకే.రాజు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమానికి పలు వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని జిల్లా అధ్యక్షుడు కేకే.రాజు అన్నారు. శనివారం YCP కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. డిసెంబర్ 15న GVMC గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లన్నున్నట్లు తెలిపారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం వినతి పత్రాలను తాడేపల్లికి ఆరోజు పంపనున్నట్లు చెప్పారు.


