News May 4, 2024

సింహాచలంలో గంధం అరగదీత ప్రారంభం

image

సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరిగే చందనోత్సవానికి ఆలయంలో గంధం అరగదీతను ఆలయ అర్చకులు వేద పండితులు శనివారం ఉదయం సంప్రదాయపద్ధంగా ప్రారంభించారు. ముందుగా పూజలు నిర్వహించారు. తొలి విడత అప్పన్న బాబుకు సమర్పించడానికి అవసరమైన 120 కిలోల గంధాన్ని అరగదీసి దానికి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ఆలయ భాండాగారంలో భద్రపరుస్తారు. చందనోత్సవ రోజున ఈ గంధాన్ని సింహాద్రిఅప్పన్నకు సమర్పిస్తారు.

Similar News

News January 3, 2025

ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పూర్తిచేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 8న అచ్చుతాపురం, నక్కపల్లిలో పలు పరిశ్రమలను విశాఖ నుంచి ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాప చేస్తారని వెల్లడించారు. అనంతరం ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.

News January 3, 2025

కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్‌కు 228 మంది హాజరు

image

పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖ కైలాసగిరి వద్ద పోలీస్ మైదానంలో గురువారం ఫిజికల్ టెస్ట్ నిర్వహించారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొని పర్యవేక్షించారు. 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు, ఛాతీ పరీక్షలు నిర్వహించారు. 600 మంది అభ్యర్థులకు గాను 228 మంది హజరయ్యారని ఎస్పీ తెలిపారు.

News January 2, 2025

డిప్యూటీ సీఎంకు చటకంభ గ్రామస్థుల విన్నపం 

image

అల్లూరి జిల్లా పెదకోట పంచాయతీ కేంద్రం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్లు దూరంలో చటకంభ ఉంది. గ్రామంలో 240 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఆ  గ్రామం మీదుగా 30 గ్రామాలున్నాయి. 15 సంవత్సరాలు క్రితం వేసిన మట్టిరోడ్డు ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా కొట్టుకుపోయింది. దీంతో తారురోడ్డు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, అల్లూరి జిల్లా కలెక్టర్‌‌ను ఆ గ్రామస్థులు విన్నవించుకున్నారు.