News April 13, 2025

సింహాచలం: చందనోత్సవానికి 51 ప్రత్యేక బస్సులు

image

సింహాచలంలో ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవానికి కొండ మీదకు 51 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు శనివారం తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండమీదకు వెళ్లే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గోశాల, శ్రీనివాస్ నగర్, అడివివరం నుంచి ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆరోజున భక్తుల వాహనాలు కొండమీదకు అనుమతి లేదని ఈ బస్సులు వినియోగించుకోవాలన్నారు.

Similar News

News April 14, 2025

అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి: ఎర్రబెల్లి

image

దేవరుప్పుల మండల కేంద్రంలో నూతన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. డాక్టర్ అంబేడ్కర్ వల్లే భారత రాజ్యాంగం సాధ్యమైందన్నారు. వారి ఆశయాలను కొనసాగించేలా చూడాలన్నారు. కొందరు దేశ రాజకీయ నేతలు అంబేడ్కర్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలున్నారు.

News April 14, 2025

2021-24 మధ్య గోశాలలో అక్రమాలు: TTD EO

image

AP: తిరుమలలోని గోశాల నిర్వహణలో మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు ఎన్నో అక్రమాలు జరిగాయని టీటీడీ ఈవో శ్యామలారావు ఆరోపించారు. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలను దాచిపెట్టారన్నారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. అలాగే స్వామివారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. రూ.3 కోట్ల విలువైన సరకులకు రూ.25 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు.

News April 14, 2025

మెదక్: అంబేడ్కర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలి: ఏఎస్పీ

image

అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా నేటి యువత ఆయనను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారన్నారు.

error: Content is protected !!