News May 8, 2024
సింహాచలం: నేడు కూడా అందుబాటులో చందనోత్సవ టికెట్లు
సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ఈనెల పదవ తేదీన జరిగే చందనోత్సవానికి సంబంధించి రూ. 300 టిక్కెట్ల విక్రయాలు బుధవారం సాయంత్రం వరకు పొడిగించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆన్ లైన్‌తో పాటు సింహాచలం నగరంలోని మహారాణిపేట అక్కయ్యపాలెం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లలో సింహాచలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో టిక్కెట్లు పొందవచ్చునని అన్నారు.
Similar News
News January 24, 2025
పాయకరావుపేటలో ఎయిర్ పోర్ట్‌కు ప్రతిపాదనలు
పాయకరావుపేటలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ముందు తుని-అన్నవరం మధ్య ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రాంతం అనుకూలం కాదని ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు సమాచారం. పాయకరావుపేట ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉండడంతో నిర్మాణానికి అన్ని విధాల అనుకూలమని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు భూముల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
News January 24, 2025
విశాఖ పోలీసుల అదుపులో నకిలీ మహిళా ఐఏఎస్..!
ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు వద్ద డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ మహిళాIASతో పాటు ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అమృత భాగ్యరేఖ అనే మహిళ MVPకాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి విశాఖCPకి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో పోలీసులు విచారించగా ఆమె నకిలీ IASగా నిర్ధారణ అయింది.
News January 24, 2025
కొత్తపల్లి జలపాతం నాలుగు రోజులు మూసివేత
జీ.మాడుగుల మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొత్తపల్లి జలపాతాన్ని ఈనెల 24 నుంచి 27 వరకు మూసివేస్తున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం తెలిపారు. జనవరి 24వ తేదీ నుంచి 27 వరకు జలపాతం ఆధునీకరణ పనులు జరుగుతున్నందున ఎవరికి ప్రవేశం లేదని చెప్పారు. ఈ విషయాన్ని గమనించి పర్యాటకులు కొత్తపల్లి జలపాతం సందర్శించవద్దని అభిషేక్ పేర్కొన్నారు.