News September 2, 2025
సింహాచలం: బదిలీ అయినా బంధం వీడదా?

సింహాచలంలో బదిలీ అయిన ఓ అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. సుదీర్ఘకాలం సింహాచలం ఆలయంలో పనిచేసిన DVS రామరాజు (హరి) ఇటీవల వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి ఆలయ ఇంజినీరింగ్ అధికారిగా బదిలీ అయ్యారు. అయినప్పటికీ వారానికి రెండు, మూడు రోజులు సింహాచలంలో దర్శనాలు, ప్రొటోకాల్ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు సమాచారం. అధికారిక ఉత్తర్వులు లేకుండా ఈ విధంగా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
Similar News
News September 3, 2025
కాన్వెంట్ జంక్షన్ వద్ద ప్రమాదం.. ఒకరి మృతి

కాన్వెంట్ జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రసాద్ గార్డెన్‌కి చెందిన ఏ.శంకర్, నాయిని చిన్న స్కూటీపై గాజువాక వెళ్తున్నారు. కాన్వెంట్ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే సమయంలో బస్సు వెనుక టైర్ల కింద పడ్డారు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన చిన్నాని హర్బర్ ట్రాఫిక్ పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు.
News September 2, 2025
ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ అభివృద్ధి చేస్తాం: సీఎం

విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైం లాజిస్టిక్స్ సమ్మిట్ ముగిసింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, లాజిస్టిక్స్ యూనివర్సిటీ, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతిని ఎయిర్ కార్గో హబ్‌లుగా అభివృద్ధి చేస్తామని, పోర్ట్ ఆధారిత ఎకానమీతో ఏపీని ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
News September 2, 2025
కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం: కలెక్టర్

కొత్త పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్ట్ అండ్ ప్రమోషన్ కమిటీ సమావేశం జరిగింది. ఏపీఐఐసీ కేటాయించిన భూముల్లో నిర్దిష్ఠ సమయంలో పరిశ్రమలు ఏర్పాటు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఆటోనగర్, ఐటీ హిల్స్ వద్ద బస్టాప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సింగిల్ డెస్క్ ద్వారా దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు.