News March 24, 2024
సింహాచలం: సింహాద్రి అప్పన్నకు రేపు పెళ్లి చూపులు

సింహాచలం సింహాద్రి అప్పన్నకు ఈనెల 25వ తేదీన పెళ్లిచూపులు జరగనున్నాయి. స్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి కొండ దిగువన గల పుష్కరిణి సత్రంలోని ఉద్యానవన మండపానికి తీసుకువస్తారు. అక్కడ మండపంలో అధిష్ఠింప చేస్తారు. పెళ్లి నిశ్చయం అయినందున స్వామిని ఊరేగింపుగా అడవివరంలో వేంచేసి ఉన్న పైడితల్లమ్మ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అనంతరం మళ్లీ ఇక్కడకు తీసుకువచ్చి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు.
Similar News
News April 8, 2025
విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బబిత

విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎం.బబితను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈమె రాష్ట్ర లీగల్ సర్వీస్ ఆథారిటీలో కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బి.సాయి కళ్యాణ్ చక్రవర్తిని గుంటూరు జిల్లాలో ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసింది. ఈయన 2022 సంవత్సరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
News April 8, 2025
విజయనగరంలో నిజాయితీ చాటుకున్న బస్సు డ్రైవర్

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రసన్న అనే పాసింజర్ తన మొబైల్ ఫోను పోగొట్టుకున్నారు. బస్సు డ్రైవర్ ఆ ఫోన్‌ని గుర్తించి డిపో అధికారులకు ఇచ్చారు. ఫోన్ పోగొట్టుకున్న పాసింజర్ వచ్చి అడగగా అతని వివరాలు తెలుసుకుని స్టేషన్ మేనేజర్ పెద మజ్జి సత్యనారాయణ సమక్షంలో ఫోన్‌ని అందించారు. నిజాయితీ చాటుకున్న డ్రైవర్‌ను పలువురు అభినందించారు.
News April 8, 2025
వ్యవసాయ అనుబంధ రంగాల గ్రోత్ రేట్ పెరగాలి: కలెక్టర్

వ్యవసాయ అనుబంధ రంగాల్లో 12.97 శాతం ఉన్న వృద్ధి రేటును ఈ ఏడాదిలో 16.32 శాతానికి పెంచాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ అనుబంధ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయంలో ఎటువంటి చర్యలు చేపట్టాలో వ్యవసాయాధికారులు మండల వారీగా కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించి పంపాలన్నారు.