News August 4, 2024

సింహాద్రిపురం: ఆన్‌లైన్ మోసగాడి అరెస్ట్

image

సింహాద్రిపురం మండలంలోని రావుల కొలనుకు చెందిన ఉప్పులూరు నాగేశ్వరరెడ్డి ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నేత అకౌంట్ నుంచి రూ. 68 లక్షలు స్వాహా చేశాడు. దీంతో సదరు నేత కర్ణాటక పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు 4 రోజుల కిందట నాగేశ్వరరెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో శనివారం సెర్చ్ వారెంట్‌తో అతని ఇంట్లో సోదాలు జరిపి పత్రాలు, ఐఫోన్, లాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News January 17, 2025

తిరుపతి రుయాలో కడప జిల్లా మహిళ మోసం

image

కడప జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి ఐదేళ్ల కిందట తిరుపతి రుయాలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేసి ఆగిపోయింది. తాజాగా సంక్రాంతి రోజు కోటు వేసుకుని రుయాకు వెళ్లింది. ఓ రోగిని స్కానింగ్ రూములోకి తీసుకెళ్లి ఒంటిపై బంగారం ఉండకూదని చెప్పింది. గాజులు, చైన్లు తీసుకుంది. తర్వాత బయటకు వచ్చి రోగి బంధువుకు బంగారం ఇచ్చి.. ఓ చైన్‌ మాయం చేసింది. సెక్యూరిటీ సిబ్బంది శ్రీవాణి కోటులో చైన్ గుర్తించడంతో కేసు నమోదైంది.

News January 17, 2025

మైదుకూరులో సీఎం పర్యటన సాగేదిలా..!

image

సీఎం చంద్రబాబు ఈనెల 18న మైదుకూరులో పర్యటించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మైదుకూరు కోర్టుకు చేరుకుంటారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అమలుపై ఆరా తీస్తారు. ఇందులో భాగంగా సీఎం ఇంటింటికీ తిరుగుతారు. తడి, పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు ఏమేర అవగాహన ఉందో తెలుసుకుంటారు. దీంతో అధికారులు అప్రమత్తమై మైదుకూరులో స్వచ్ఛత పనులు చేస్తున్నారు.

News January 17, 2025

కడప: 23, 24 తేదీల్లో స్పోర్ట్స్ మీట్ – 2025

image

కడప నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఈనెల 23, 24 తేదీల్లో రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా స్పోర్ట్స్ మీట్ -2025 నిర్వహిస్తున్నట్లు కడప నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ మీట్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వాలీబాల్, రన్నింగ్ రేస్, కబడ్డీ, బాడ్మింటన్ క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నెల 21లోపు ఎంట్రీలు నమోదు చేసుకోవాలన్నారు.