News March 25, 2024
సింహాద్రి అప్పన్నకు వైభవంగా పెళ్లి చూపులు

సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నృసింహస్వామి డోలోత్సవం (పెళ్లి చూపులు) సోమవారం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు సాంప్రదాయబద్దంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవో ఎస్.శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపించారు. తెల్లవారుజామున సింహాద్రినాదుడు ఉత్సవమూర్తి ప్రతినిధి గోవిందరాజు స్వామిని సర్ణాభరణాలతో అందంగా అలంకరించారు.
Similar News
News October 21, 2025
సింహాచలం దేవస్థానం ఇన్‌ఛార్జ్ ఈవోగా సుజాత

సింహాచలం దేవస్థానం ఇన్‌ఛార్జ్ ఈవోగా ప్రస్తుతం జోనల్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సుజాతకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ ఈవోగా వ్యవహరిస్తున్న త్రినాథరావు రిలీవ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది.
News October 21, 2025
విశాఖ జూపార్క్ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య

విశాఖ జూ పార్క్ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. డెయిరీ ఫారం నుంచి ఎండాడ వైపు వెళ్తున్న జాతీయ రహదారి పక్కన చెట్టు కొమ్మకు ఓ వ్యక్తి ఉరివేసుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు ఈ దృశ్యాన్ని చూసి భయాందోళన చెందారు. వీరి సమాచారంతో ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 21, 2025
భాగస్వామ్య సదస్సుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: విశాఖ కలెక్టర్

నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులతో సమీక్షించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీఐపీలు, అతిథుల కోసం పార్కింగ్, భద్రత, వైద్య, పారిశుద్ధ్య ఏర్పాట్లు, తాగునీరు, హోటల్ వసతి, హోం స్టేలను సిద్ధం చేయాలని సూచించారు.