News August 14, 2024
సింహాద్రి అప్పన్న నిత్యన్నదానానికి నేటితో 35 ఏళ్లు

సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రారంభించిన నిత్య అన్నదాన సత్రానికి నేటితో 35 సంవత్సరాలు పూర్తికానుంది. 1989 ఆగస్టు 14వ తేదీన అప్పటి దేవస్థానం ఉద్యోగులు మొదటి విరాళంగా రూ.50 వేలుతో ఈ అన్నదానాన్ని ప్రారంభించారు. 2024 ఆగస్టు 14తో 36వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 35 కోట్ల 50 లక్షల రూపాయలు డిపాజిట్‌తో ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు.
Similar News
News February 19, 2026
టెక్నాలజీతో నిఘా.. ‘అస్త్రం’ యాప్‌తో ట్రాఫిక్ నియంత్రణ

విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ బందోబస్తును పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి స్వయంగా పర్యవేక్షించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ‘అస్త్రం’ & ‘ఈ-పాత్’ యాప్‌ల సాయంతో భద్రతను పగడ్బందీగా నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకను విజయవంతం చేసిన సిబ్బందిని సిపీ అభినందించారు. పోలీసులకు సహకరించిన నగర ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News February 19, 2026
విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

విశాఖలో జరుగుతున్న ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం విశాఖ వచ్చారు. ఆయనకు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పలువురు నేవీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖలో ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొని సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.
News February 19, 2026
ఎంవీపీ: ప్లాస్టిక్ కవర్ల వాడకం.. రూ.1000 జరిమానా

జీవీఎంసీ అదనపు కమిషనర్ నల్లనయ్య గురువారం 18వ వార్డులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్న రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ షాపుల యజమానులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక్కొక్కరికి రూ. 1000 జరిమానా విధించారు. ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యమని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.


