News July 20, 2024

సికింద్రాబాద్‌లో ఆమ్రపాలి కాట ఇన్‌స్పెక్షన్

image

రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట ఏర్పాట్లను పరిశీలించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంతో పాటు పలు దేవాలయాలకు సంబంధించిన రూట్‌లపై ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్, తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు ఫీల్డ్‌లో అందుబాటులో ఉండాలన్నారు.

Similar News

News August 21, 2025

HYD: నేటి నుంచి ప్రత్యేక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

image

GHMCలో నేటి నుంచి ఈ నెల 25 వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు GHMC కమిషనర్ కర్ణన్ తెలిపారు. వర్షాకాలంలో వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించడానికి పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. వాతావరణశాఖ సూచనల ప్రకారం రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉండడంతో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాల తొలగింపునకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.

News August 20, 2025

కొందుర్గు: కలెక్టర్‌కు లేఖ రాసిన విద్యార్థులు

image

కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్, డీఈఓకు లేఖ రాశారు. తమ పాఠశాలలో పనిచేస్తున్న సుష్మ అనే టీచర్ గండిపేట పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారని, దీంతో తమ పాఠశాలలో శివారెడ్డి అనే టీచర్ ఒకరే ఉండడంతో చదువు బోధించడం ఇబ్బందిగా మారిందని, వెంటనే సుష్మ టీచర్‌ను తమ పాఠశాలకు పంపించాలని విద్యార్థులు కోరారు.

News August 19, 2025

4,600 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి: రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్

image

రంగారెడ్డి జిల్లాకు కొత్తగా వచ్చిన అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని భూమికి సంబంధించిన ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయంటూ బాధితులు వచ్చి కలుస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అడిషనల్ కలెక్టర్ ఆఫీస్ గోడపై బోర్డులు ఏర్పాటు చేశారు. ‘నా వద్ద 4,600 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి.. వీటిని క్లియర్ చేయడానికి నాకు సమయం పడుతుంది.. దయచేసి సహకరించండి’ అంటూ ఇలా నోటీస్ అంటించి బాధితులని కోరుతున్నారు.