News January 31, 2026
సికింద్రాబాద్‌లో ‘దొంగ’ ప్లాన్ వేశాడు.. పోలీసులకు దొరికాడు!

నకిలీ కలర్ జిరాక్స్ నోట్లను ATM మెషిన్‌లో డిపాజిట్ చేసిన వ్యక్తి అరెస్టైన సంఘటన మహంకాళి PS పరిధిలో చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్‌కి చెందిన షేక్ మోసిన్ రెజిమెంటల్‌బజార్‌లోని ఓ లాడ్జిలో ఉంటూ నకిలీ కలర్ జిరాక్స్ నోట్లను ప్రింట్ చేసి ఏటీఎం మిషన్‌లో డిపాజిట్ చేసాడు. అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కావడం లేదని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసలు విషయం బయటపడడంతో షేక్ మోసిన్‌ను అరెస్ట్ చేశారు.
Similar News
News February 1, 2026
మోస్రా: పాడే మోసిన పోచారం, సీపీ

విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య(24) అంత్యక్రియల్లో ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీపీ సాయి చైతన్యలు పాడె మోశారు. సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
News February 1, 2026
భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాక్

రానున్న టీ20 వరల్డ్ కప్ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్-పాక్ తలపడాల్సి ఉంది.
News February 1, 2026
ప్రశాంతంగా మొదటి రోజు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

72 పరీక్షా కేంద్రాలలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల వివరాలను ఆర్ఐఓ లాలప్ప వెల్లడించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరంలో 3,895 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 158 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరంలో 2,684 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, 48 మంది గైర్హాజరయ్యారయ్యారని ఆయనను వివరించారు.


