News March 26, 2025
సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

సికింద్రాబాద్ మహంకాళి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం.. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్పాట్ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Similar News
News March 29, 2025
అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

అంబర్ పేట పీఎస్‌లో న్యూస్‌లైన్ నిర్వాహకుడు, యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఓ మహిళ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69,79,352, 351(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు అంబర్ పేట పోలీసులు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపణ చేసింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపారు.
News March 29, 2025
హైదరాబాద్ భగభగ మండుతోంది..!

హైదరాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారం ముషీరాబాద్ మండలంలో అత్యధికంగా 40.0℃, షేక్‌పేట 39.9, నాంపల్లి 39.9, అంబర్‌పేట్ 39.9, మరేడ్‌పల్లి 39.9, హిమాయత్‌నగర్ 39.9, ఖైరతాబాద్ 39.9, అసిఫ్‌నగర్ 39.9, చార్మినార్ 39.9, బండ్లగూడ 39.9, సైదాబాద్ 39.8, బహదూర్‌పురా 39.5, గోల్కొండ 39.4, సికింద్రాబాద్ మండలంలో 39.4 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది.
News March 29, 2025
కూకట్‌పల్లి: డబ్బులు విషయంలో ఒత్తిడి తట్టుకోలేక వ్యక్తి అదృశ్యం

ఇంటి నిర్మాణానికి సంబంధించి EMI కట్టాలంటూ అన్న వదిన వేధిస్తుండడంతో యువకుడు అదృశ్యమైన ఘటన KPHBలో చోటుచేసుకుంది. వంశీకృష్ణ (33), శాలిని దంపతులు కో లివింగ్ హాస్టల్లో నివాసం ఉంటున్నారు. వంశీకృష్ణ సొంత ఊరిలో తన సోదరుడితో కలిసి ఇంటి నిర్మాణం చేపట్టారు. దీని విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగగా EMI చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమయ్యాడు.