News March 26, 2025
సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

సికింద్రాబాద్ మహంకాళి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం.. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్పాట్ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Similar News
News March 29, 2025
గుంటూరు: పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్‌ల పేరుతో మోసాలు జాగ్రత్త: ఎస్పీ

పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్‌ల పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనల పట్ల గుంటూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. లైక్, షేర్ చేస్తే రివ్యూలు ఇస్తే డబ్బులు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతారని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
News March 29, 2025
తిరువూరు: అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన కొలికపూడి వ్యవహారం

తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం TDP అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఆ పార్టీ నేత రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం ప్రకటించారు. నేటి ఉదయం11 గంటలకు ఆయన విధించిన డెడ్‌లైన్ పూర్తికానుంది. దీంతో ఆయన ఏం చేస్తారనే అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా మరోవైపు కొలికపూడి తీరుపై అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. మీరేమనుకుంటున్నారో COMMENT చేయండి.
News March 29, 2025
పూజకు ఉత్తమ ఫలితాలు రావాలంటే..

పూజ చేయడం పుణ్యఫలాన్నిస్తుంది. అయితే పూజ ఎప్పుడు ఎలా చేయాలన్నదానిపై పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘సూర్యోదయమైన 2 లేదా 3 గంటల్లోపే పూజ ముగించుకోవడం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ 9 గంటల్లోపు పూర్తయ్యేలా చూసుకోవాలి. అప్పటి వరకు ఉండే మానసిక ప్రశాంతతతో దైవంపై ఏకాగ్రత కుదురుతుంది. పూజ అలా ఉదయాన్నే చేసేవారికి రోజంతా ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటుంది’ అని వివరిస్తున్నారు.