News June 5, 2024
సికింద్రాబాద్: ఆ పార్టీల కుట్రలు తిప్పికొట్టారు: కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ప్రజలు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల కుట్రలను తిప్పి కొట్టారని కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలో ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో ఢిల్లీకి వెళ్తున్నానని, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కలుస్తానని అన్నారు. ఈ దఫా మహిళలతోపాటు యువ, దళిత పలు మోర్చాల కార్యకర్తలు విశేష కృషి చేశారన్నారు.
Similar News
News December 29, 2025
HYD కుర్రాళ్ల ‘విష్ జార్’ మాయ

కోడింగ్ రాసి అలసిపోతున్న మన Gen-Z బ్యాచ్ కొత్త ట్రెండ్ అందుకుంది. 13-wish jar మంత్రం జపిస్తోంది. ఆఫీసు గొడవలు మర్చిపోవాలని చిట్టీలు రాసి తగలబెడుతున్నారు. లక్ష్యాలను మధ్యలోనే వదిలేస్తామని భయం ఉన్నా 43% మంది డిజిటల్ మాయ వద్దని ఫిక్స్ అయ్యారు. స్క్రీన్ టైమ్ తగ్గించాలన్నది వీరి ప్లాన్. ట్రాఫిక్ జామ్ మధ్య స్లో లివింగ్ మజా వెతుక్కుంటున్నారు. సిటీ కుర్రాళ్లంతా రియల్ లైఫ్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నారు.
News December 29, 2025
మిగిలింది గ్రేటర్ హైదరాబాదే!

TGలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు EC సమాయత్తం అవడంతో గ్రేటర్‌లో చర్చ మొదలైంది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ ఇదే కావడంతో ఇక్కడి పీఠం మీద ప్రధాన పార్టీలు గురి పెడుతున్నాయి. ఓ వైపు సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడేమో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు EC ప్రిపేర్ అవుతోంది. అయితే, GHMC పాలకవర్గం FEB-2026లోనే ముగియనుంది. దీంతో HYDలో ఎన్నికలు ఎప్పుడు? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
News December 29, 2025
విజయ్ హజారేలో హైదరాబాద్ బే‘జారే’!

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మూడో సారి ఓటమి పాలైంది. సోమవారం జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో అస్సాం 4 వికెట్ల తేడాతో HYDను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అస్సాంలో శిబ్‌శంకర్ రాయ్ (112) మెరుపు సెంచరీ చేశాడు. సౌరవ్ (91) పరుగులతో రాణించాడు. దీంతో లక్ష్యాన్ని ASM 49.3 ఓవర్లలో సాధించి విజేతగా నిలిచింది.


