News January 17, 2026

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు హౌస్ అరెస్ట్

image

లష్కర్ ప్రాంతంలో నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు దెబ్బతినకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News January 26, 2026

హైదరాబాద్: 24 ఏళ్ల తర్వాత చారిత్రక దృశ్యం

image

హైదరాబాద్ చారిత్రక కోత్వాల్ హౌస్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కాగా, 2002 తర్వాత తొలిసారిగా నగర పోలీస్ కమిషనర్ కోత్వాల్ హౌస్‌లో జాతీయ జెండాను ఎగురవేయడం విశేషం. ఈ కార్యక్రమం నగరానికి గర్వకారణంగా నిలుస్తోంది.

News January 26, 2026

అక్రిడిటేషన్ కార్డుల జారీ.. GOలో కీలక సవరణలు

image

అక్రిడిటేషన్ కార్డుల జారీపై ఉన్న జీవో 252లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. జీవో ఆర్టీ నంబర్ 103 ద్వారా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల్లో మహిళలకు 33 శాతం తప్పనిసరి చేసింది. మీడియా కార్డు బదులు అక్రిడిటేషన్ పేరుతోనే కార్డు జారీ చేయనుంది. సర్క్యులేషన్ ఆధారంగా అదనపు అక్రిడిటేషన్‌లకు అవకాశం కల్పించడంతో పాటు, వివిధ విభాగాల్లో పనిచేసేవారికి కార్డులు రానున్నాయి.

News January 26, 2026

HYD: అమ్మాయిలూ.. ఈ NUMBER SAVE చేసుకోండి

image

మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారా..? మౌనంగా భరించకండి. మీకు పోలీసులు అండగా ఉన్నారని చెబుతున్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఆడపిల్లలను ఎవరు వేధించినా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. నిందితులకు భయపడకుండా వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని, బాధితుల వివరాలు సీక్రెట్‌గా ఉంచుతామని తెలిపారు. 9490616555 నంబరుకు వాట్సప్ ద్వారా లేదా, 100కు డయల్ చేసినా క్విక్ రెస్పాన్స్ ఉంటుందంటున్నారు. SHARE IT.